Share News

ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు..

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:18 PM

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు..
SRH vs CSK

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఇవాళ(శనివారం) ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. రాత్రి 07:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా పెద్దఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


ఉప్పల్ స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 04:30 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. మెుత్తం 11 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని.. వాహనాల్లో వచ్చే వారు వాటిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ల్యాప్టాప్‌లు, బ్యాగులు, గాడ్జెట్లు వంటివి స్టేడియం లోపలికి నిషేధించినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లకూ ఎంట్రీ లేదన్నారు.


బ్యానర్లు, పదునైన వస్తువులపైనా పూర్తి నిషేధం విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గత మ్యాచ్‌కి స్మార్ట్ వాచ్‌లు, సన్ గ్లాసెస్, వాలెట్లు అనుమతించలేదని.. ఈ మ్యాచ్‌కీ వాటిని తీసుకురావద్దని చెప్పారు. క్లాక్ రూమ్ సౌకర్యం లేదని, తమ వస్తువులను ఇంటి వద్దే పెట్టి రావాలని క్రికెట్ అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏప్రిల్‌లో మరింత ఎండలు.. రాత్రిపూటా తగ్గని ఉష్ణోగ్రతలు

ఆ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ ధన్యవాదాలు

Updated Date - Apr 18 , 2026 | 01:25 PM