అభిషేక్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు.. సీఎస్కే విజయ లక్ష్యం 195
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. సీఎస్కేకి 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విధ్వంసకర బ్యాటర్లు అభిషేక్ శర్మ(59; 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్(59; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్(23) పర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్(0), అనికేత్ వర్మ(2), నితీశ్ కుమార్ రెడ్డి(12), సలీల్ అరోరా(13), లియామ్ లివింగ్‌స్టోన్(1), శివాంగ్ కుమార్(12) తీవ్రంగా నిరాశపర్చారు. ప్రఫుల్ హింగే(0*) నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3, జెమీ ఓవర్టన్ 3 చెలరేగారు. ముకేశ్ చౌదరి 2, గుర్జాప్‌నీత్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: సాల్ట్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 176
కేఎల్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం