కేఎల్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:42 PM
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో ఓటమిని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో ఓటమిని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి ఓవర్ వేసిన రొమారియో షెఫర్డ్ 5 బంతుల్లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటివరకు ఆర్సీబీ వైపు విజయాన్ని డేవిడ్ మిల్లర్(22*; 10 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) అలవోకగా లాగేసుకున్నాడు.
కేఎల్ రాహుల్(57), స్టబ్స్(60*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు కెప్టెన్ అక్షర్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పాతుమ్ నిశాంక(1), కరుణ్ నాయర్(5), సమీర్ రిజ్వి(2) మరోసారి విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్య 1 వికెట్ తీసుకున్నారు. అంతుకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(63; 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
విరాట్ కోహ్లీ(19), దేవదత్ పడిక్కల్(18), రజత్ పాటీదార్(8), టిమ్ డేవిడ్(26), రొమారియో షెఫర్డ్(1), జితేశ్ శర్మ(14), కృనాల్ పాండ్య(12) నిరాశపర్చారు. రసిక్ సలామ్ దార్(0*), భువనేశ్వర్ కుమార్(3*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, ముకేశ్ కుమార్ 1, లొంగి ఎంగిడి 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!