ఐపీఎల్ 2026: సాల్ట్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 176
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:25 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. డీసీకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(63; 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
విరాట్ కోహ్లీ(19), దేవదత్ పడిక్కల్(18), రజత్ పాటీదార్(8), టిమ్ డేవిడ్(26), రొమారియో షెఫర్డ్(1), జితేశ్ శర్మ(14), కృనాల్ పాండ్య(12) నిరాశపర్చారు. రసిక్ సలామ్ దార్(0*), భువనేశ్వర్ కుమార్(3*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, ముకేశ్ కుమార్ 1, లుంగి ఎంగిడి 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!