Share News

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:13 PM

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
RCB vs Delhi Capitals

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వీకెండ్ స్పెషల్ డబుల్ ధమాకా ఉండబోతోంది. నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేయనుంది. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆడిన నాలుగింట్లో రెండు మ్యాచులు గెలిచిన ఢిల్లీ.. ఆరో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఆధిపత్యం ఎవరిదో చూడాల్సి ఉంది.


ఆర్సీబీ తుది జట్టు

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, హేజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రసిక్ సలామ్ దార్, వెంకటేశ్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, మంగేశ్ యాదవ్, విక్కీ


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు

పాతుమ్ నిశాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, ఆకిబ్ నబి దార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముకేశ్ కుమార్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విప్‌రాజ్ నిగమ్, అశుతోశ్ శర్మ, కరుణ్ నాయర్, దుశ్మంత్ చమీరా, నితీశ్ రాణా


ఇవి కూడా చదవండి:

సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్

చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

Updated Date - Apr 18 , 2026 | 03:13 PM