నటి తాన్యాపై పరువు నష్టం దావా వేసిన చాహల్.. ఎందుకంటే?
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:43 PM
బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీపై టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పరువు నష్టం దావా వేశాడు. చాహల్ తనకు ఇన్‌స్టాలో ప్రైవేట్‌గా మెసేజ్‌లు పంపిస్తున్నాడంటూ తాన్యా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీపై టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పరువు నష్టం దావా వేశాడు. చాహల్ తనకు ఇన్‌స్టాలో ప్రైవేట్‌గా మెసేజ్‌లు పంపిస్తున్నాడంటూ తాన్యా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ చాహల్ తనకు నేరుగా మెసేజ్ చేసినట్లు స్క్రీన్ షాట్‌ను ఆమె మీడియాకు చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తాన్యాపై చాహల్ పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తోంది.
తాన్యా ఆరోపణల తర్వాత చాహల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అతడి పీఆర్ టీమ్ ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరినట్టు తాన్యా పేర్కొంది. ఈ విషయంపై తాజాగా తాన్యా స్పందించింది. మెసేజ్ చేసిన చాహల్‌ను ఎవరూ ప్రశ్నించడం లేదని.. తనపై మాత్రమే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
‘ఈ విషయం ఇంత వైరల్ అవుతుందని నాకు తెలియదు. నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది. కానీ దానికి వ్యతిరేకంగా నా మీదే పరువు నష్టం దావా వేశారు. ఎందుకు యుజ్వేంద్ర చాహల్‌ను ఎవరూ ప్రశ్నించట్లేదు. నేను అతని వ్యక్తిత్వాన్ని తప్పు పట్టాలని అనుకోలేదు. నాకు చాహల్‌పై ఎంతో గౌరవం ఉంది’ అని తాన్యా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!