‘సర్పంచ్’కి అర్థం తెలియక అయోమయంగా అనిపించేది: శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:40 PM
శ్రేయస్ అయ్యర్‌ను అభిమానులు, సహచర ఆటగాళ్లు ‘సర్పంచ్ సాబ్’ అంటూ పిలుస్తారన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన తర్వాతే అయ్యర్‌కు ఈ నిక్‌నేమ్ పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రేయస్ ఆ ట్యాగ్ గురించి వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు అజేయంగా దూసుకెళుతోంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను అభిమానులు, సహచర ఆటగాళ్లు ‘సర్పంచ్ సాబ్’ అంటూ పిలుస్తారన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన తర్వాతే అయ్యర్‌కు ఈ నిక్‌నేమ్ పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రేయస్ ఆ ట్యాగ్ గురించి వివరించాడు. మొదట్లో సర్పంచ్‌కు అర్థం తెలియక అయోమయంగా అనిపించేదని, మీనింగ్ తెలుసుకున్న తర్వాత స్పష్టత వచ్చిందని తెలిపాడు.
‘నాకు ‘సర్పంచ్’ అనే పదం బాగా నచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో ప్రయాణం మొదలైనప్పుడు ఇలా ఎందుకు పిలిచారో కూడా తెలియదు. గందరగోళంగా అనిపించేది. అప్పుడే సహచరులను అడిగా. సర్పంచ్ అంటే ఏంటో వారు వివరించారు. కుటుంబం, ఒక గ్రూప్, లేదా ఊరు.. ఇలాంటి వాటికి పెద్దగా వ్యవహరించేవారినే సర్పంచ్ అంటారని తెలిసింది. అప్పటినుంచి ‘సర్పంచ్’ నా ప్రయాణంలో భాగమైంది. నాకెంతో ఇష్టమైన నిక్‌నేమ్‌గా మారిపోయింది’ అని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
గతేడాది పంజాబ్ కింగ్స్ సారథిగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అయ్యర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 203 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌లో 14 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!