Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
SRH vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు దిగనుంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబద్ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్.. 3 విజయాలతో 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు 5 మ్యాచుల్లో మూడింట గెలిచిన ఢిల్లీ.. 6 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తాజా పోరు ఇరుజట్లకు కీలకం కానుంది.


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, హర్ష్ దూబె, ఎషాన్ మలింగ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: స్మరన్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, మదుశంక, హర్షల్ పటేల్


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు

పాతుమ్ నిశాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, నితీశ్ రాణా, స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి.నటరాజన్, లుంగి ఎంగిడి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: కరుణ్ నాయర్, చమీరా, అశుతోశ్ శర్మ, త్రిపురన విజయ్, ఆకిబ్ నబి


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 21 , 2026 | 07:19 PM