వైభవ్ సూర్యవంశీకి వచ్చిన క్రేజ్ అతడికి రాలేదు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:43 PM
ఐపీఎల్ 2026లో యువ బ్యాటర్ల హవా కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి ప్లేయర్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యకు ఎక్కువగా హైప్ రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ బ్యాటర్ల హవా కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి ప్లేయర్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యకు ఎక్కువగా హైప్ రాలేదు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు చేసి తన మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లో 211 పరుగులు సాధించి అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేకు వచ్చినంత క్రేజ్ ప్రియాంశ్ ఆర్యకు రాలేదని అభిప్రాయపడ్డాడు.
‘ఏ బ్యాటర్‌నూ తక్కువ చేయాలని కాదు కానీ ఇప్పుడున్న యువ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నాడు. అతడి ఆట తీరు చూస్తే చూడముచ్చటేస్తోంది. ప్రియాంశ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉంది. షాట్ల రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అతడే భారత క్రికెట్‌కు భవిష్యత్తు అని అనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలకు వచ్చినంత క్రేజ్.. ప్రియాంశ్ ఆర్యకు రాలేదు’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 246 పరుగులు చేయగా.. ఆయుశ్ మాత్రే 201 పరుగులు చేశాడు. ప్రియాంశ్ ఆర్య 211 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆరు మ్యాచుల్లో ఐదు గెలవగా, ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్