Home » Sports
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్‌లో పేర్కొన్నారు.
డిసెంబర్ 21 నుంచి భారత మహిళల జట్టు శ్రీలంకతో ఐదు వన్డే సిరీస్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.
అనివార్య కారణాల వల్ల స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్మృతి కోసం బీగ్‌బాష్ లీగ్‌కు దూరమైంది. ఈ విషయంపై ప్రముఖ నటుడు సునీల్ శెట్టి స్పందించారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలాశ్ తల్లి అమిత స్పందించారు. అతి త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.
అండర్ 19 ఆసియా కప్‌నకు సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. కాగా ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
డబ్ల్యూపీఎల్ 2026 సంబంధించిన మెగా వేలం ఢిల్లీ వేదికగా మొదలైంది. ఈ మెగా ఆక్షన్‌ను మల్లికా సాగర్ నిర్వహిస్తున్నారు. ఈ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తాము రాణించలేదని.. ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్.. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ అయింది.