Share News

భారత్, పాక్ మ్యాచ్: ఆకాశాన్నంటిన కొలంబో విమాన టికెట్‌ ధరలు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 07:00 PM

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇండియాలోని ప్రధాన నగరాల నుంచి కొలంబో వెళ్లే విమానాల టికెట్ల ధరలు ఊహించని విధంగా పెరిగాయి.

భారత్, పాక్ మ్యాచ్:  ఆకాశాన్నంటిన కొలంబో విమాన టికెట్‌ ధరలు..
Flight Ticket Prices

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)లో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 15న) కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమని బెట్టు చేసిన పాక్‌ ఐసీసీ ఒత్తిడికి తలొగ్గి.. యూ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో హైఓల్టేజ్‌ పోరుకు రూట్ క్లియర్ అయింది. ఇదే సమయంలో కొలంబో వెళ్లే విమానాల టికెట్ల ధరలు రాకెట్ కంటే వేగంగా నింగివైపు దూసుకెళ్తున్నాయి.


సాధారణ రోజుల్లో ఉంటే ధరల కంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. మాములు సమయంలో ఢిల్లీ(Delhi) నుంచి కొలంబో వెళ్లేందుకు టికెట్‌ ధర రూ.30,000 ఉంటుంది. కానీ.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం కారణంగా ప్రస్తుతం ఆ ధర రూ.90,000లకు చేరుకుంది. బిజినెస్‌ క్లాస్‌లో అయితే ఏకంగా రూ.1,92,000లకు పెరిగింది. ముంబై నుంచి కొలంబో మధ్య నడిచే శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ ధర రూ.40,000గా ఉంది.


విమాన టికెట్ల ధరలతో పాటు కొలంబోలోని హోటల్‌ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 14, 15 వ తేదీల్లో స్టార్ హోటళ్లలో ఒక్క రాత్రికి డబుల్ బెడ్ రూమ్స్‌కు రూ.1.05 లక్షల నుంచి 1.06 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు సాధారణంగా వీటి ధర రూ.40,000 నుంచి 50,000 వరకు మాత్రమే ఉండేది. మొత్తంగా ఇండియా, పాకిస్థాన్(Ind vs Pak) మ్యాచ్ క్రేజ్ ఎలా ఉంటుందో ఈ ధరలు తెలియజేస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

టీ20 ప్రపంచ కప్2026: నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో గెలిచిన సౌతాఫ్రికా

Updated Date - Feb 11 , 2026 | 07:06 PM