టీ20 ప్రపంచ కప్ 2026: పాక్‌కు షాకిచ్చిన షాక్‌విక్.. యూఎస్ఏ టార్గెట్ 191
ABN , Publish Date - Feb 10 , 2026 | 08:54 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా యూఎస్ఏ-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యూఎస్ఏకి 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా యూఎస్ఏ-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యూఎస్ఏకి 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫర్హాన్(73) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బాబర్ ఆజాం(46) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆదిలో దూకుడు ప్రదర్శించిన పాక్.. చివర్లో తడబడింది. యూఎస్ఏ బౌలర్ షాడ్లీ షాక్‌విక్ 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు.
ఆయూబ్(19), షాదాబ్ ఖాన్(30) పర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(1), నవాజ్(5), అష్రఫ్(1), ఉస్మాన్ ఖాన్(0), అబ్రార్(0) వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. చివరి ఓవర్లో రెండు రనౌట్‌లు కావడం గమనార్హం. యూఎస్ఏ బౌలర్లలో షాక్‌విక్ 4, నేత్రవాల్కర్, మొహ్సిన్, హర్మీత్ సింగ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు
టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు