టీ20 ప్రపంచ కప్2026: ఇంగ్లండ్ టార్గెట్ 197
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:16 PM
ఐసీసీ టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ 20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్ , వెస్టిండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 196 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (42 బంతుల్లో 76 పరుగులు) చెలరేగి ఆడటంతో కరేబియన్ జట్టు భారీ స్కోర్ చేసింది. అలానే రోస్టన్ చేజ్(29 బంతుల్లో 34 పరుగులు), జాసన్ హోల్డర్(17 బంతుల్లో 33 పరుగులు) కూడా రాణించారు.
హెట్మెయర్(23) రోవ్ మన్ పావెల్(14) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ షాయ్ హోప్ విఫలమయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ , సామ్ కుర్రన్ తలో వికెట్ సాధించారు. మొత్తంగా విండీస్ జట్టు ఇంగ్లండ్ జట్టు ముందు 197 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!
టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం