Share News

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:13 PM

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది.

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ
Sri Lanka vs Oman, T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(World Cup-2026)లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్చి 6న ఐర్లాండ్ పై కేవలం 20 పరుగుల తేడాతో గెలిచిన లంక జట్టు.. ఈసారి మాత్రం భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-బి లో రెండు విజయాలతో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక(Srilanka) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది. కుశాల్‌ మెండిస్‌ ( 45 బంతుల్లో 61), పవన్‌ రత్నాయకే (28 బంతుల్లో 60), డాసున్‌ శనక ( 20 బంతుల్లో 50) అర్ధ సెంచరీలతో రాణించారు. డాసున్ అయితే కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతడు భారీ షాట్ కు ప్రయత్నించి జితేన్ రామానంది బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిషార (8) విఫలమయ్యారు. చివరల్లో కమిందు మెండిస్‌ (7 బంతుల్లో 19 పరుగులు) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఒమన్‌ బౌలర్లలో జితేన్‌ రామానంది 2, జే ఒడెద్రా, సుఫ్యాన్‌ మెహమూద్‌ తలో వికెట్‌ సాధించారు.


226 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్‌కు దిగిన పసికూన ఒమన్(Oman) తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ నదీమ్ (53*) చివరి వరకు పోరాడినా.. అది ఓటమి అంతరాని మాత్రమే తగ్గించగలిగింది. వసీమ్ అలీ (20 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో చమీరా, తీక్షణ తలో రెండు వికెట్లు సాధించారు. హేమంత, కమిందు మెండిస్‌, దునిత్ వెల్లలాగే తలో వికెట్‌ తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 03:20 PM