Home » Sports
ఇవాళ(ఆదివారం) రాంచి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును క్రియేట్ చేసింది.
ఐపీఎల్ 2026కి ముందు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఎన్నో ఏళ్లుగా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్‌ను.. ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు మిచెల్ నేటివెల్‌తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయి వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాయి. మరి రాంచి పిచ్ ఎలా ఉండనుందనే సందేహం మొదలైంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొడితే అత్యధిక సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సఫారీలతో తొలి వన్డేలో ఈ ఫీట్ అందుకునే అవకాశం ఉంది.
రాంచి వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై సఫారీల కెప్టెన్ బవుమా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం.. కెప్టెన్ రాహుల్‌కు బలమని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా-భారత్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో రాహుల్ కెప్టెన్సీలో ఫామ్ అందుకుని వరుసగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ .. ఈ సిరీస్‌లో మళ్లీ అదే రికార్డు తిరగరాయనున్నాడా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.