Share News

'షేక్ హ్యాండ్' విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ రిప్లై ఇదే

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:44 PM

టీ20 ప్రపంచ కప్‌2026లో రేపు భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నట్లు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు. టీమిండియాతో పోరు సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఘా పాల్గొన్నాడు.

'షేక్ హ్యాండ్' విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ రిప్లై ఇదే
India vs Pakistan T20 World Cup 2026

స్పోర్డ్స్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య కరచాలన వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా ప్లేయర్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలానే ఆసియా కప్-2025 ట్రోఫీని సైతం ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా రేపు(ఆదివారం) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి షేక్ హ్యాండ్ అంశం తెరపైకి వచ్చింది. భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? అంటూ ఎదురైన ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా సమాధానం ఇచ్చాడు.


టీమిండియాతో పోరు సందర్భంగా ఇవాళ(శనివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ అఘా(Salman Agha) పాల్గొన్నాడు. ‘ ఐసీసీ టోర్నీల్లో ఒకటైన ప్రపంచ కప్ లో మాకు భారత్‌పై మంచి రికార్డు లేదు. గతాన్ని మేము మార్చలేం. అయితే, ఈసారి మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. అలానే తారిక్ బౌలింగ్‌ యాక్షన్‌పై వచ్చే విమర్శలను పట్టించుకోం. ఇప్పటికే అతడి బౌలింగ్‌ పై ఐసీసీ రివ్యూ చేసి క్లీన్‌చిట్ ఇచ్చింది. బాబర్ అజామ్ ఫామ్‌ గురించి మాకెలాంటి ఆందోళన లేదు. తప్పకుండా అతడు పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాం. మా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కువగా మార్పులు చేయం' అని వెల్లడించాడు.


టీమిండియా ప్లేయర్లను కరచాలన(Shak Hand) అడుగుతారా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. రేపు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చాడు. 'టీమిండియా ప్లేయర్లతో కరచాలనం గురించి ఇప్పుడే చెప్పలేం. వారు ఇస్తే తప్పకుండా మేమూ షేక్‌ హ్యాండ్ ఇస్తాం. ఏం జరుగుతుందో రేపు చూద్దాం.. భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని మ్యాచ్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని మేమూ కోరుకుంటాం. టాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఫలితాన్ని అది నిర్ణయించదు. ఎవరు బాగా ఆడితే వారే విజయం సాధిస్తారు' అని సల్మాన్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 14 , 2026 | 05:19 PM