Share News

టీ20 ప్రపంచ కప్2026: నేపాల్‌పై వెస్టిండీస్ ఘన విజయం

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:34 PM

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇవాళ(ఆదివారం) ముంబై వేదికగా విండీస్, నేపాల్ జట్లు తలపడ్డాయి.

టీ20 ప్రపంచ కప్2026: నేపాల్‌పై  వెస్టిండీస్ ఘన విజయం
West Indies vs Nepal

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇవాళ(ఆదివారం) ముంబై వేదికగా విండీస్, నేపాల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 15.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షాయ్ హోప్(61*), హెట్ మయర్ (46*) చెలరేగారు. అలానే బ్రాండన్ కింగ్ 22 పరుగులు చేశాడు.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి133 పరుగులు మాత్రమే చేసింది. నేపాల్ బ్యాట‌ర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (59) అర్ధ సెంచ‌రీ చేశాడు. సోంపాల్ కామి (26 నాటౌట్) రాణించాడు. ఓ ద‌శ‌లో 73 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి నేపాల్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శలో దీపేంద్ర సింగ్ ఐరీ, సోంపాల్‌లు ఏడో వికెట్‌కు 54 ప‌రుగులు జోడించి ఆదుకున్నారు.


ఇక వెస్టిండీస్ బౌల‌ర్లలో జేస‌న్ హోల్డర్ నాలుగు వికెట్లు సాధించింది. అకేల్ హోసేన్, మాథ్యూ ఫోర్డే, షమర్ జోసెఫ్, రోస్టన్ చేజ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో నేపాల్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలానే వరుసగా మూడు విజయాలతో విండీస్ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Feb 15 , 2026 | 02:58 PM