Home » Sports
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో పసికూన హాంగ్‌కాంగ్‌పై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
చనిపోవాలని ఉందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ల యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరితనం భరించలేకపోతున్నానని ఆయన వాపోయారు.
భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్-ఏ క్రికెట్ లో అరుదైన రికార్డును సృష్టించాడు. సౌతాఫ్రికా-ఏ జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డును బవుమా సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్‌గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం గంగూలీ.. హెడ్ కోచ్ గంభీర్‌కు ఓ కీలక సూచన చేశాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై భారత మాజీ బ్యాటర్ పుజారా స్పందించాడు. స్వదేశంలో టీమిండియా ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించాడు.
ఏసీసీ టోర్నీలో ఇండియా-ఏ జట్టుపై పాకిస్తాన్-ఏ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ దగ్గర క్యాచ్ పట్టినా అంపైర్ నాటౌట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అతడి తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.