Home » Sports
మూడో అనధికార టీ20లో ఆస్ట్రేలియా-ఎ 168/5 స్కోరు చేసి భారత్-ఎను 161 పరుగులకే ఆలౌట్ చేసింది. వ్రింద దినేష్ 69 పరుగులతో రాణించినా భారత్-ఎకు 7 పరుగుల ఓటమి తప్పలేదు.
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండో రౌండ్‌లోనూ విజయాల పరంపర కొనసాగించింది. నిహాల్ సరీన్ కీలక విజయం సాధించగా, మహిళల జట్టులో దివ్యా దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, సావిత్రి శ్రీ గెలిచారు.
పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ తమ బంధానికి ముగింపు పలికారు. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట భవిష్యత్ లక్ష్యాలు భిన్నంగా ఉండటంతో విడిపోతున్నట్లు ఆకృతి తెలిపింది.
డేవిస్ కప్ క్వాలిఫయర్ రౌండ్-2లో భారత్, దక్షిణ కొరియా మధ్య రెండు రోజుల పోరు ప్రారంభం కానుంది. క్వార్టర్‌ఫైనల్ బెర్త్ కోసం భారత్ బలమైన సవాల్‌కు సిద్ధమైంది.
ఆసియా క్రీడల మహిళల క్రికెట్ క్వార్టర్స్‌లో భారత్ శుక్రవారం జపాన్‌తో పోటీ పడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు బలమైన బౌలింగ్‌తో ముందుకు సాగుతోంది.
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పదవీకాలానికి పొడిగింపు లభించే అవకాశం తక్కువగా ఉందని బీసీసీఐ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.
భారత్ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనున్న మెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ విషయంలో పాకిస్థాన్ కొత్త పేచీ పెట్టింది. మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని, టోర్నీ నిర్వహణను మరో దేశానికి మార్చాలని ఆసియా హాకీ సమాఖ్యను కోరింది.
వెస్టిండీస్-భారత్ మధ్య జరగబోయే సిరీస్‌ల కోసం బీసీసీఐ వన్డే, టీ20 జట్లను తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి మూడు వన్డేలు, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20లు జరగనున్నాయి.
భారత బాక్సర్లకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది.
భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్ కలకలం రేపుతోంది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది.