టీ20 ప్రపంచ కప్ 2026: టీమిండియా వార్మప్ మ్యాచుల షెడ్యూల్ ఇదే
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:35 PM
టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందే 16 వార్మప్ మ్యాచులు ఉంటాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందే 16 వార్మప్ మ్యాచులు ఉంటాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 4న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఫిబ్రవరి 2(నేడు)న యూఎస్ఏతో ఇండియా ఏ జట్టు ఆడనుంది. ఈ రెండు మ్యాచులు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ నెల 6న నమీబియా-ఇండియా‘ఏ’ మధ్య మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ(BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరగనుంది. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
అఫ్గానిస్థాన్-స్కాట్లాండ్, యూఎస్ఏ- ఇండియా ‘ఏ’, కెనడా - ఇటలీ, నేపాల్ - యూఏఈ, అఫ్గానిస్థాన్ - వెస్టిండీస్, పాకిస్థాన్ - ఐర్లాండ్, నేపాల్- కెనడా, న్యూజిలాండ్ - యూఎస్ఏ, ఇటలీ - యూఏఈ, నమీబియా- ఇండియా ‘ఏ’ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. సర్జరీ చేయించుకుని పూర్తిగా కోలుకున్న స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma)ను మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇండియా ‘ఏ’ జట్టుకు ఎంపిక చేశారు. తిలక్ టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన సంగతి తెలిసిందే.
వార్మప్ మ్యాచ్‌లకు ఇండియా ఏ జట్టు:
ఆయుష్ బదోని (కెప్టెన్), నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, నారాయణన్ జగదీశన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (వికెట్‌కీపర్), గుర్జప్‌నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్.
ఇవీ చదవండి:
ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్