Share News

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:52 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది
Shahid Afridi

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ టోర్నీ నుంచి బంగ్లాను తొలగించినందుకు నిరసనగా పాక్.. భారత్‌తో మ్యాచులను బహిష్కరిస్తుందని వెల్లడించింది. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న టీమిండియా-పాక్ తలపడాల్సి ఉంది. అయితే భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలన్న పాక్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) స్పందించాడు.


‘రాజకీయాలు తలుపులు మూసినప్పుడు క్రికెట్ తలుపులు తెరుస్తుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. కానీ టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో పాక్ ఆడకపోవడం బాధాకరమైన విషయమే. అయినప్పటికీ మా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు ఐసీసీ.. మాటలతో కాకుండా చర్యలతో తాము నిష్పక్షపాతంగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం వచ్చింది. ఐసీసీ నిర్ణయంపైనే పాక్ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది’ అని షాహిద్ అఫ్రిది ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

2-sa.jpg


అఫ్రిది వ్యాఖ్యలపై చర్చ

క్రీడలు, రాజకీయాలు వేరుగా ఉండాలని చెప్పే అఫ్రిది.. ఇప్పుడు ప్రభుత్వ జోక్యాన్ని సమర్థించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భారత్ లెజెండ్స్ జట్టు పాకిస్తాన్ లెజెండ్స్‌తో మ్యాచ్ ఆడకపోవడంపై అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిఖర్ ధావన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో అఫ్రిది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం పద్ధతిగా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడా వేదికపై రాజకీయాల ప్రభావం మరోసారి తీవ్ర చర్చకు దారితీసిందని అంటున్నారు.


ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 02 , 2026 | 02:53 PM