Home » Sports
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు కిట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఆసియా క్రీడల మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు అధికారిక కిట్ అందినట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
జపాన్ వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ భారత పతాకధారులుగా వ్యవహరించారు.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ విషయంలో సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేశారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై మాట్లాడాడు.
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు తనకు బహుశా చివరివని చెప్పాడు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అనూహ్యంగా గాయపడ్డాడు. ఓ యాడ్ షూట్‌లో భాగంగా డైవింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతడి కుడి భుజం డిస్‌లోకేట్ అయింది.
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు కిట్ కష్టాలు ఎదురయ్యాయి. కొంతమంది ఆటగాళ్లకు జెర్సీ సైజులు సరిపోకపోవడంతో కొత్త కిట్ల కోసం బీసీసీఐ.. కిట్ సప్లయర్‌ను సంప్రదించింది. ఇదిలా ఉంటే, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు రేపు జపాన్ బయల్దేరనుంది.
యారాడ కొండ... అక్కడో మత్స్యకార కుటుంబం. విద్యుత్ సదుపాయం కూడా లేని గ్రామం. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి ఇప్పుడు చెస్‌లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించింది.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసకర బ్యాటింగ్‌ను క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువీ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు.