అండర్ 19 ప్రపంచ కప్: భారత్‌తో సెమీ ఫైనల్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:50 PM
అండర్ 19 ప్రపంచ కప్ 2026 తుది దశకు చేరుకుంది.రెండో సెమీస్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్తాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా కుర్రాళ్లు తొలుత ఫీల్డింగ్ చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్ 2026 తుది దశకు చేరుకుంది. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీస్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్తాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా కుర్రాళ్లు తొలుత ఫీల్డింగ్ చేయనున్నారు. అఫ్గానిస్తాన్ జట్టు టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనలు చేస్తూ గట్టి పోటీనిస్తూ వచ్చింది. అయితే ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
మరోవైపు టీమిండియా.. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా సెమీస్‌కు చేరింది. అన్ని విభాగాల్లో ప్లేయర్లు రాణిస్తున్నారు. అయితే గ్రూప్ మ్యాచులన్నీ ఇప్పటి వరకు భారత్ బులవాయోలో ఆడింది. సెమీఫైనల్ మాత్రం హరారే వేదికగా ఆడనుంది . మైదానం మారడం, పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం భారత జట్టుకు పరీక్షగా మారవచ్చు.
భారత తుది జట్టు..
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే(కెప్టెన్), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్, అంబరీశ్
అఫ్గానిస్తాన్ తుది జట్టు..
ఉస్మాన్ సాదత్, ఖలిద్, ఫైజల్, ఉజైరుల్లా, మహబూబ్ ఖాన్, అజిజుల్లా, అబ్దుల్ అజిజ్, ఖతిర్, రూహులుల్లా అరబ్, నూరిస్తాని ఒమర్జాయ్, జర్దాన్
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ