Home » Snake
ఓ ఇంటి వాటర్ ట్యాంకులో పెద్ద మొత్తంలో పాములు వెలుగుచూసిన ఘటన హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27 పాములు వాటర్ ట్యాంకులో కనిపించాయి.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు.
పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన ఓ వృద్ధుడిని విష సర్పం చుట్టేసింది. నాలుగు గంటల పాటు నరకం చూపించింది. ఈ సంఘటన ఒడిశాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్ మరోసారి తన అత్యుత్సాహంతో వార్తల్లో నిలిచారు. పాములను ఒట్టిచేతులతో పట్టుకున్నారు. వాటిని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక పాము ఆయన చేతిపై కాటేసింది.
నాగుపాము, కట్లపాములో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరిలో హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.
రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఉన్న బాలుడిని మొదట నాగుపాము కాటేసింది. తర్వాత కొద్ది నిమిషాలకే మరో విష సర్పం రక్తపింజరి కాటు వేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో స్నేక్ స్నాచర్స్ రెస్క్యూలో పట్టుబడుతున్న పాముల్లో 54శాతం విష సర్పాలే అని సీఎస్ఐఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (ఎఫ్‌ఓఎస్) హైదరాబాద్ అధ్యయనం వెల్లడించింది.
నాగుపామును పట్టుకున్న ఓ స్నేక్ క్యాచర్ జనం ముందు ఫోజులు కొట్టడానికి దానితో ఆటలాడాడు. అది రెండు సార్లు కాటు వేసినా ఆస్పత్రికి వెళ్లలేదు. దీంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
మారిన వాతావరణ పరిస్థితులతో విష సర్పాలు బయటకు వస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులను కాటు వేస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు.. ఇంకోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాములు, తేళ్లు, జెర్రిలు బయటకు వచ్చి కాటు వేస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికను త్రాచుపాము కాటేసింది. ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.