Snake: పాముకు పాలు పోసి పూజలు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:05 PM
నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం.
- బతికుండగానే అన్నీ.. అనంతరం అడవిలోకి..
రాయచూరు(బెంగళూరు): నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం. ఏకంగా బతికున్న పాముకు పూజలు చేసి అందరినీ అశ్చర్యంలో ముంచారు. ఈ వింత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మంగళవారం జిల్లాలోని లింగసుగూరు తాలూకా జంగిరాంపూర్(Jangirampur) తండాలో చోటు చేసుకుంది.
తండాకు చెందిన సునీల్ పవార్ తన ఇంటి వద్ద కనిపించిన నాగుపాముకు ప్రత్యేక్షంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయకొట్టి దండాలు పెట్టడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆయనే స్వయంగా పాములు పట్టే వారిని పిలిపించి పామును అడవికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News