Home » Sircilla
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు.
తుఫాను వల్ల పంటలను కోల్పో యిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. కొలనూర్లో మీస అర్జున్ రావు, గొట్టేముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.
పోలీస్ సిబ్బందికి విధి నిర్వ హణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్లో సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన నియామవళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముల్కల పల్లి, కమాన్పూర్, రాజాపూర్, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, నాగారం గ్రామాల్లో సోమవారం సెర్ప్ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.
రామగుండం ఫెర్టిటైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో సోమవారం తెల్లవారుజామున యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూరియా ప్లాంట్లో గ్యాస్ పైప్లైన్కు సంబంధించి సాంకేతిక సమస్యతో లీకేజీ ఏర్పడింది. దీంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయిల్ పామ్ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు ప్రోత్సహించా లన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.
పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.