Share News

ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:44 PM

ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధమని, ఎన్నికల సమయంలో పారదర్శకంగా వినియోగించుకొని మంచి పాలన పొందే దిశగా ముందుకు సాగాలని ఆర్డీఓ గంగయ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓటు ప్రాముఖ్యతపై ఆయన ప్రసంగించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధమని, ఎన్నికల సమయంలో పారదర్శకంగా వినియోగించుకొని మంచి పాలన పొందే దిశగా ముందుకు సాగాలని ఆర్డీఓ గంగయ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓటు ప్రాముఖ్యతపై ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ నిజాయితీగా నాయకులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. నా దేశం... నా ఓటు అనే థీమ్‌తో భారత ప్రభుత్వం 2026 ఓటరు దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నదన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, భాష, పేదరికం, ధనికులు తేడా లేకుండా అందరికి సమానంగా ఓటు హక్కును కల్పిం చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగిం చుకొని దేశ పటిష్టతకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారిని ఆర్డీఓ అభినందించి, ఓటరు కార్డులు అందజేశారు. సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. కలెక్టరేట్‌ ఏఓ ప్రకాష్‌, అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:44 PM