ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు అందాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:50 PM
ప్రభుత్వ సం క్షేమ పథకాలు గడపగడపకు అందేలా మెప్మా సిబ్బంది, ఆర్‌పీలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. శనివారం మిలీనియం హాల్‌లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతినగర్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సం క్షేమ పథకాలు గడపగడపకు అందేలా మెప్మా సిబ్బంది, ఆర్‌పీలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. శనివారం మిలీనియం హాల్‌లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అర్హులు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా ప్రభుత్వం అం దిస్తున్న పథకాలను ఇంటింటా వివరించాలని తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న నిరుపేద మహిళలకు స్వశక్తి సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలని అన్నారు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తే వారికి కావాల్సిన నైపుణ్యాన్ని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తానన్నారు. సోలార్ ప్లాంట్, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వ స్థలం ఇప్పించ డంతోపాటు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలకు సహ కారం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు రూ.50 వేల నుండి రూ.కోటి వరకు రుణాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు తమ రుణ వాయిదాలు సవ్యంగా చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. బం గారు భవిష్యత్ ఉన్న యువత గంజాయి మత్తుపదార్థాల వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తపడేలా మహిళా సంఘ సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. నగరపాలకసంస్థ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు పలు రంగాల్లో శిక్షణ అందించి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జాబ్‌లు ఇప్పించినట్లు తెలిపారు. నిరుద్యోగులకు పీఎం ఈజీపీ, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించే పీఎం స్వనిధి తదితర పథకాలపై అవగాహన పెం చాలన్నారు. అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 284 స్వశక్తి సంఘాలకు రూ.28.9 కోట్లు, పీఎం స్వనిధి ద్వారా 13,503 మంది వీది వ్యాపారులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తు న్నామన్నారు. మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ మౌనిక, సీఓలు శమంత, ఉర్మిళ, శ్వేత, ప్రియదర్శిని పాల్గొన్నారు.