లయన్స్ క్లబ్ సేవలు మరువలేనివి
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:46 PM
లయన్స్‌క్లబ్ సేవలు మరువ లేనివని భగవద్గీత ప్రచార ఫౌండర్ డాక్టర్ ఎల్‌వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం దుర్గానగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వ హించిన లయన్స్‌క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 32వ జీ9వ రీజియన్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): లయన్స్‌క్లబ్ సేవలు మరువ లేనివని భగవద్గీత ప్రచార ఫౌండర్ డాక్టర్ ఎల్‌వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం దుర్గానగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వ హించిన లయన్స్‌క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 32వ జీ9వ రీజియన్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మాన వ సేవే మాధవ సేవ అనే విధంగా లయన్స్‌క్లబ్ పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తోందని, ఉచితంగా అవయవాల పంపిణీ, కంటి చికి త్సలు, స్కూళ్లలో పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే భగవద్గీత గొప్పదని, ప్రతి ఒక్కరూ భగవద్గీత ప్రవచనాలను ఆచరించాలని కోరారు. కంజపురం రాజేందర్, జయప్రద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 11 లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారా యణ, మినేష్ ఠండన్, పీ మల్లికార్జున్, ఎల్లప్ప, పాకాల గోవర్ధన్‌రెడ్డి, ముడతనపల్లి సారయ్య, సీనియర్ లయన్స్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.