మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:48 PM
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని అనువుగా మార్చుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని అనువుగా మార్చుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుం డా ప్రజలను మోసం చేసిందన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందేమి లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీని పూర్తి స్థాయిలో బలో పేతం చేసి ఎన్నికల్లో ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడడం తథ్యమన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ పట్టణ అధ్య క్షుడు ఉప్పు రాజ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోబిన్, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు గుణపతి, ప్యాక్స్ మాజీ చైర్మన్ సం దీప్‌రావు, సూర శ్యాం, మాజీ కౌన్సిలర్లు పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, పెద్ది వెంకటేశ్, రాజమల్లు, గోపి, తదితరులు పాల్గొన్నారు.