Share News

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:46 PM

కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్లు అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శనివారం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

పెద్దపల్లిటౌన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్లు అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శనివారం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నాన్నారు. యుఐడీఎఫ్‌ నిధులు 63 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. గతంలో 30 కోట్ల నిధులతో తారు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బస్సు డిపో ఏర్పాటు వల్ల రాష్ట్రంలో జిల్లాకు గుర్తింపు తెచ్చామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో బస్సు డిపో ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఎన్నికల ముందు గడప గడపకు విజ్జన్న కార్యక్రమంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంక టేష్‌, ఎఈ, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:46 PM