• Home » Sircilla

Sircilla

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. ఆదివారం ర్యాకల్‌దేవ్‌పల్లి శివాలయం నుంచి ముప్పిరి తోట, ధూళికట్ట వరకు రూ.12 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అంత్యక్రియలకు అవస్థలు..

అంత్యక్రియలకు అవస్థలు..

నగరంలోని మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటిక నిర్వహణను నగరపాలక సంస్థ పూర్తిగా గాలికి వదిలేసింది. 2017 సంవత్సరంలో ఆనాటి పాలకవర్గం నగరంలోని మూడు ప్రధాన శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ నిధులను కేటాయించింది.

గమ్యం చేరని పయనం

గమ్యం చేరని పయనం

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వాహన దారుల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలో ఈ యేడాది తొలి ఏడు నెలల్లోనే 238 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 78 మంది మృతిచెందగా, 140 మంది తీవ్ర గాయాలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

వేలిముద్ర పడాల్సిందే..

వేలిముద్ర పడాల్సిందే..

పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకులు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో మొదలైన ఈ-కేవైసీ మొదట్లో వేగంగానే నిర్వహించినా ఆ తర్వాత లబ్ధిదారుల్లో నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించకపోవడం, డీలర్లు పట్టించుకోకపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ మందగించింది.

 వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

వనమహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు పడని కారణంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు సైతం రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి.

అక్రమ దందాలపై నిఘా

అక్రమ దందాలపై నిఘా

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించారు. కమిషనర్‌గా అంబర్‌ కిశోర్‌ ఝా బాధ్యతలు తీసుకున్న తరువాత టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని నార్కోటిక్‌ విధులకు వినియోగించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్‌పై అనేక ఆరోపణలు రావడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అంబర్‌ కిశోర్‌ ఝా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కాళిందిని అధికారులను ఆదేశించారు. రాఘవాపూర్‌, సబ్బితం గ్రామాల్లో ఆమె పర్యటించారు.

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలుచేయాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలుచేయాలి

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్‌లో జరిగింది.

 వరి సాగు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు

వరి సాగు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు

ఎల్‌నినో ప్రభావం తీవ్రం కాబోతుందని, వరి పంటలు సాగు వద్దన్నా కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తే సాగునీటి కొరత వల్ల ఆర్థిక నష్టాలు తప్పవని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కలిసి ప్రారంభించారు.

సింగరేణిలో దొంగలు పడ్డారు...

సింగరేణిలో దొంగలు పడ్డారు...

సింగరేణిలో ఆదాని, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని జీఎం ఆఫీస్‌ గ్రౌండ్‌లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని, దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి