Share News

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:58 PM

జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కాళిందిని అధికారులను ఆదేశించారు. రాఘవాపూర్‌, సబ్బితం గ్రామాల్లో ఆమె పర్యటించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

పెద్దపల్లి రూరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కాళిందిని అధికారులను ఆదేశించారు. రాఘవాపూర్‌, సబ్బితం గ్రామాల్లో ఆమె పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ఫార్మ్‌పాండ్‌ పనులను పరిశీలించారు. రాఘవాపూర్‌ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన డీఆర్‌డీఓ ఫార్మ్‌పాండ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై ఆరా తీశారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం నిర్వహణను పరిశీలించి మొక్కల సంరక్షణతో పాటు అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. సబ్బితంలో ఫారెస్ట్‌ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు తాడిశెట్టి చామంతి శ్రీకాంత్‌, నూనె సరోజన రమేష్‌, ఏపీఓ రమేష్‌బాబు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ వెంకటేష్‌, కార్యదర్శులు భానుప్రసాద్‌, అఫ్జల్‌ పాషా, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంపత్‌, రమేష్‌, సీసీ హరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:58 PM