వరి సాగు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:55 PM
ఎల్‌నినో ప్రభావం తీవ్రం కాబోతుందని, వరి పంటలు సాగు వద్దన్నా కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తే సాగునీటి కొరత వల్ల ఆర్థిక నష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష కలిసి ప్రారంభించారు.
ఓదెల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం తీవ్రం కాబోతుందని, వరి పంటలు సాగు వద్దన్నా కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తే సాగునీటి కొరత వల్ల ఆర్థిక నష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష కలిసి ప్రారంభించారు. తహసీల్దార్ వనజ ఆమె ఛాంబర్‌ను ప్రారం భించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, జిల్లాలో రెవెన్యూ భవనాలకు సొంత భవనా లను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే జూని యర్ సివిల్ కోర్టుకు సొంత భవనాన్ని మం జూరు చేస్తామన్నారు. మండలంలో ముఖ్య మైన ప్రధాన రోడ్లు పూర్తయ్యాయని తెలి పారు. బావుల్లో, బోరుబావుల్లో ఉన్న భూగర్భ జలాలు ఎల్‌నినో ప్రభావం వల్ల ఇంకిపోతు న్నాయన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా మక్కలు, నువ్వులు, కందులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే రైతులకు ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రతీ రైతు పంట మార్పిడి చేయా లని, ప్రస్తుతం పంటల మార్పిడి చేస్తేనే ఎల్‌నినో నుంచి గట్టెక్కుతామన్నారు. బీఆర్ ఎస్ పాలనలో కాళేశ్వరం, సుందిళ్ల ప్రాజెక్టు లను కట్టి రైతులను నట్టేట ముంచారని తెలి పారు. నాలుగు నియోజకవర్గాలకు ఈ ప్రాజె క్టుల నీటిని ఇచ్చినట్లు హరీష్‌రావు ప్రగ ల్బాలు పలుకుతున్నారని, నీరు ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తొలి నీటిబొట్టు పెద్దపల్లి నియో జకవర్గాన్ని ముద్దాడిందని హరీష్‌రావు అం టున్నాడని, చుక్క నీరు కూడా తాకలేద న్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూభారతిలో పరిష్కారం కాని వాటిని అధి కారులు మార్పు చేస్తారని, ఇప్పటికి 12వేల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామన్నారు. సమస్యల పరిష్కారానికి రీసర్వేను ప్రవేశ పెట్టిందని తెలిపారు. మూడు నెల లు రీ సర్వే ప్రక్రియ కొన సాగుతుందని, రైతులు సహకరిస్తే 90 శాతం ఫలి తాలు వస్తాయని తెలి పారు. ఎల్‌నినో వల్ల భూ గర్భ జలాలు తగ్గిపోతు న్నాయని, దీని భారం రైతులకే కాకుండా విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్నారు. దీని నుంచి గట్టెక్కాలంటే జలశ్రీ పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అడి షనల్ కలెక్టర్ శ్రీరాములు, సర్పంచ్ కనకిరెడ్డి సతీష్, ఎంపీడీవో అనిల్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్య క్షుడు మూల ప్రేమ్‌సాగర్ రెడ్డి, ఆలయ చైర్మన్ మొండయ్య, అధికార ప్రతినిధి బైరి రవి, మాజీ సర్పంచ్ డిల్లి శంకర్, సర్పం చులు ఆవాల ప్రసాద్, గంగిశెట్టి ప్రభాకర్, పల్లె కనుకయ్య చిట్ల రాము పాల్గొన్నారు.