Share News

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:09 PM

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. ఆదివారం ర్యాకల్‌దేవ్‌పల్లి శివాలయం నుంచి ముప్పిరి తోట, ధూళికట్ట వరకు రూ.12 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ఎలిగేడు, జూలై 26(ఆంధ్రజ్యోతి): డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. ఆదివారం ర్యాకల్‌దేవ్‌పల్లి శివాలయం నుంచి ముప్పిరి తోట, ధూళికట్ట వరకు రూ.12 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పనుల నాణ్యతపై ప్రశ్నించి, త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నద న్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో పెండింగ్‌ పనులు, నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రైతులు ఎల్‌నినో ప్రభావం తో వర్షాలు సరిగా పడడటం లేదని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేయాలని కోరారు. ఎలిగేడు, కనుకుల పీఎసీ ఎస్‌ చైర్మన్‌లు సామ రాజేశ్వర్‌రెడ్డి, చిలుక సతీష్‌, నాయకులు దుగ్యాల సంతోష్‌ రావు, సర్పంచ్‌లు సిద్ది తిరుపతి, కప్పల ప్రవీణ్‌, రాయమల్లు, మారం కొమురయ్య, మద్దెల రమాదేవి, నాయకులు కోరుకంటి వెంక టేశ్వర్‌రావు, అర్వనపల్లి వెంకటేశ్వర్‌రావు, అమ్ముల రమేష్‌, పొట్యాల రమేష్‌, తాటిపల్లి రమేష్‌బాబు, సుధాకర్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:09 PM