Home » Sircilla
పెద్దపల్లి నియోజకవర్గంలో హెచ్‌అండ్‌టీ గోదాముల ద్వారా ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్, రబీ సీజన్ల ధాన్యం కొనుగోళ్శలో సుమారు రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు పేదలకు అందించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పని చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యా భివృద్ధి అంశాలపై సమీక్షించారు.
ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వందకు వంద శాతం పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అధికా రులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మండల పరిషత్ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం జలసిరి కార్యక్ర మం చేపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. సోమవారం వీవో అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు వృథా కాకుండా వ్యసాయానికి ఉపయోగప డేలా రైతులు పంట పొలాల్లో ఫాంపాండ్, ఊట కుంటలు ఏర్పాటు చేసు కోవాలన్నారు.
సూపర్ ఎల్‌ని నో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులను ఆదేశించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తొలి విజయమని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు.
పెద్దపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణకు మున్సిపల్ పాలకవర్గం సిద్ధమైంది. పెరిగిన జనాభా దృష్యా రోడ్డు విస్తరణకు నిర్ణయించి నిధులు కేటాయించారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా విస్తరణ కొంత తగ్గించాలని పలువురు వ్యాపారులు మున్సిపల్ చైర్మన్‌ను కోరారు.
రామగుండం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య, ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం భాస్కర్‌రావు భవన్‌లో సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.