ముగిసిన జనజాతర
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:14 AM
రెండేళ్లకోసారి నిర్వ హించే వనదేవతల జాతర శనివారం ముగిసింది. సమ్మక్క సారలమ్మలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయ డంతో జాతర ముగిసింది. చివరి రోజు కూడా భక్తులు జాతరకు వెళ్లి మొక్కులు సమర్పించారు.
పెద్దపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లకోసారి నిర్వ హించే వనదేవతల జాతర శనివారం ముగిసింది. సమ్మక్క సారలమ్మలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయ డంతో జాతర ముగిసింది. చివరి రోజు కూడా భక్తులు జాతరకు వెళ్లి మొక్కులు సమర్పించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అనుబంధంగా జిల్లాలోని అంతర్గాం మండలం గోదావరి ఒడ్డున గల గోలివాడ, గోదావరిఖనిలోని గంగ బ్రిడ్జి వద్ద, మానేరు తీరాన గల సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం కొల నూర్, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్, పెద్ద రాతు పల్లి, కమాన్‌పూర్ మండలం గుండారం, ముత్తారం మం డలం మైదుబండ, పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, హన్మంతునిపేట, పెద్దకల్వల, పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి, వేమునూర్, రాణాపూర్, ధర్మారం మండలం ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లి, నందిమేడారం, చామ నపల్లి, దొంగతుర్తి, నర్సింగాపూర్, ఎలిగేడు మండలం ఎలిగేడు, తేలుకుంట, జూలపల్లి మండలం అబ్బాపూర్, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణపూర్, తొగ ర్రాయి, ఓదెల మండలం గుంపుల, తదితర ప్రాంతాల్లో జాతర జరిగింది. అన్ని జాతరలకు సుమారు 12 లక్షల మంది భక్తులు సందర్శించుకోవడం గమనార్హం. జిల్లాకు చెందిన భక్తులే గాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు సైతం వచ్చారు. ఇంటిల్లిపాది కోరిన కోర్కెలు తీర్చాలంటూ తల్లులకు మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు గాకుండా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, జాతర కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టడడంతో పాటు ప్రధానంగా ట్రాఫిక్ సమ స్యలు తలెత్తకుండా చూశారు. గోదావరిఖని, గోలివాడ, కొల నూర్, నీరుకుల్ల జాతరలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
కళ్యాణ్‌నగర్/మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని సమ్మక్క - సారలమ్మ జాతరకు శనివారం కూడా పెద్దఎత్తున భక్తులు వచ్చి వన దేవతలను దర్శించుకు న్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకోగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచ రించి సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజులకు మొక్కులు సమర్పించారు. గోదావరి తీరంలో మూడు రోజులుగా గుడా రాలు వేసుకుని ఉన్నారు.
గోదావరి తీరంలో జరిగిన జాతరకు సుమారు 8లక్షల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజులుగా జనంలో ఉన్న సమ్మక్క - సారల మ్మలను శనివారం రాత్రి కోయపూజారులు వనంలోకి తరలించారు. శనివారం రాత్రి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి తమ కుటుంబాలను చల్లగా చూడా లంటూ వన దేవతలను వేడుకున్నారు. మళ్లీ రెండేళ్లకు వస్తామంటూ మొక్కులు అప్పగించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాసింగ్ రాజ్‌ఠాకూర్ జాతర కోసం సుమారు రూ.7కోట్లను సింగరేణి నుంచి మంజూరు చేయించి జాతర శాశ్వతంగా, సుందరంగా తీర్చిదిద్దారు చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ కాంతారెడ్డి వన దేవతలను వనంలోకి ప్రవేశపెట్టారు.