చివరి రోజు నామినేషన్ల జోరు
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:03 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు శుక్రవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖల య్యాయి. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 1342 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు భీఫాంలు జారీ చేయలేదు.
పెద్దపల్లి, జనవరి 30 (ఆంద్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు శుక్రవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖల య్యాయి. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 1342 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు భీఫాంలు జారీ చేయలేదు. 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో అభ్యర్థులు ఆయా పార్టీలకు చెందిన బీఫాంలు సమర్పిస్తారో వారిని ఆ పార్టీల అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకుని బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను కేటాయిస్తారు.
అభ్యర్థులకు అంద ని బీఫాంలు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు ఆయా రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో పార్టీ భీఫాంలు అందజేయలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పటి వరకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంలను అందజేయలేదు. అధికార పార్టీలో డివిజన్లు, వార్డుల్లో ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అయితే నామినేషన్లకు ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండడంతో ఆ లోపు ఆయా పార్టీల పేరిట నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలను సమర్పించాల్సి ఉంది. కొన్ని డివిజన్లు, వార్డులకు సంబంధించి అభ్యర్థులు ఖరారు అయినప్పటికి బీఫాంలను ఎవరికీ అందజేయలేదు.
నామినేషన్ల పత్రాలను శనివారం పరిశీలించను న్నారు. సక్రమంగా ఉన్న నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసే అలోచన చేస్తున్నాయి. ఎక్కడైనా తమ అభ్యర్థులకు సంబంధించిన నామి నేషన్ పత్రాలు కొట్టుడుపోతే, ప్రత్యామ్నాయంగా తమ పార్టీపై నామి నేషన్ దాఖలు చేసిన అభ్యర్థికి బీఫాంలను అందజే యాలని చూస్తున్నా యి. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో ఉంటున్నారో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత గానీ తెలిసే పరిస్థితి లేదు. అప్పటివరకు కొన్ని పార్టీల అభ్యర్థులకు ఉత్కంఠ తప్పదు.
జిల్లాలో నామినేషన్లు ఇలా..
పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను చివరి రోజు 210
నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 339 నామినేషన్లు
దాఖలయ్యాయి.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను చివరి రోజు
78 నామినేషన్లు రాగా మొత్తం 139 నామినేషన్లు దాఖలయ్యాయి.
మంథని మున్సిపాలిటీలో 13 వార్డులకుగాను చివరి రోజు 92
నామినేషన్లు రాగా, మొత్తం 158 నామినేషన్లు వచ్చాయి.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60
డివిజన్లకు గాను చివరి రోజు 525 నామినేషన్లు రాగా మొత్తం 706
నామినేషన్లు దాఖలయ్యాయి.