Share News

కుష్టు వ్యాధిపై అందరికి అవగాహన ఉండాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:07 AM

ప్రతీ ఒక్కరికి కుష్టు వ్యాధిపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కుష్టు వ్యాధిపై అందరికి అవగాహన ఉండాలి

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరికి కుష్టు వ్యాధిపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతీ విద్యార్థి కుష్టు వ్యాధిపై చుట్టు పక్కల వారికి అవగాహన కల్పిం చాలని ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ కుష్టు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్పర్శలేని గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. నిర్లక్ష్యం చేయవద్దని, అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, డిప్యూటీ పారా మెడికల్‌ అధికా రులు రమేష్‌, దేవిసింగ్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఉమా మహేశ్వర్‌, ఎంపీహెచ్‌ఓ రాజేష్‌, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల ప్రిన్సి పాల్‌ దీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:07 AM