Share News

రామగుండంలో చేరికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:19 AM

రామ గుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేని వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో డివిజన్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీదారులు, ప్రభావితం చేసే నాయకులే లక్ష్యంగా ఆపరేషన్‌ సాగుతుంది.

 రామగుండంలో చేరికలపై  కాంగ్రెస్‌ ఫోకస్‌

కోల్‌సిటీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రామ గుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేని వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో డివిజన్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీదారులు, ప్రభావితం చేసే నాయకులే లక్ష్యంగా ఆపరేషన్‌ సాగుతుంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా పని చేసిన నాయకులు ఆయా డివిజన్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో వారిని తిరిగి కాం గ్రెస్‌లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేసిన నాయకులను పక్కన పెట్టి తటస్థులుగా ఉన్న నాయకులపై ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా రెండు మూడు డివిజన్లలో గెలుపోటములను ప్రభావితం చేయగల నాయకులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్లు అనుకూలించని నాయకు లపై దృష్టి పెట్టి ఆయా డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ఇప్ప టికే మాజీ కార్పొరేటర్‌ పీచర శ్రీనివాసరావు, పాముకుంట్ల భాస్కర్‌ లను, నాయకులు చిం తల సతీష్‌, కవ్వంపల్లి కనకలక్ష్మిలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్న చోట పిలిచి ఒకరే పోటీలో ఉండాలని ఎమ్మెల్యే సూచిస్తు న్నారు. ఎస్‌సీ డివిజన్లను ఏకపక్షంగా గెలువా లనే లక్ష్యంతో ఆయా డివిజన్లలో ప్రభావితం చేసే నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 20డివిజన్లలో విపక్షాలకు బలమైన అభ్యర్థులు లేకుండా వ్యూహరచన చేశారు. పోటీదారులుగా ఉండాలనుకున్న వారు నామినేషన్లకు దూరంగా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా మరో 20డివిజన్లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా చేరికలుండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 12:19 AM