Share News

బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:09 AM

మెజా రిటీ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. సుల్తానాబాద్‌ లో శుక్రవారం బీజేపీ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి

సుల్తానాబాద్‌, జనవరి 30 (ఆంద్రజ్యోతి): మెజా రిటీ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. సుల్తానాబాద్‌ లో శుక్రవారం బీజేపీ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులలో పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఆయా వార్డుల ఇంచార్జీలతో సమీ క్ష చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలన్నారు. ఆయన మాట్లాడుతు మున్సిపాలిటీలలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను లక్ష్యంగా చేసుకుని తాము ఇంటింటి ప్రచారం నిర్వహి స్తామన్నారు. వార్డులతో పాటు బూత్‌ కమిటీల బలోపేతం చేస్తామని, కార్య కర్తలను సమన్వయయంతో విజయం దిశగా ముందుకు తీసు కువెళతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధిపై పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ఎన్నికలలో విజయం సాధించాలన్నారు.

ఎమ్మెల్సీ సమక్షంలో పలువురు బీజేపీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్‌ యాదవ్‌, మండల,పట్టణ అద్యక్షులు కందుల శ్రీనివాస్‌, కూకట్ల నాగరాజు, జిల్లా నాయకులు మిట్టపల్లి ప్రవీణ్‌ కుమార్‌, రాజేంద్ర ప్రసాద్‌, చిట్టవేనిసదయ్య, గుడ్ల వెంకటేశ్‌ శేఖర్‌, తిరుపతి, లంక శంకర్‌, భాగ్యలక్ష్మి, సంతోష్‌, గజబీంకార్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:09 AM