Share News

ఉద్యోగుల క్వార్టర్స్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:13 AM

అడ్రియాల, ఓసీపీ-2 ఉద్యోగులకు సెక్టార్‌-3 కాలనీలో టీటూ, టీవన్‌, షిర్కే క్వార్టర్‌లను కేటా యించేందుకు గురువారం అధికారులు క్వార్టర్ల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఉద్యోగుల క్వార్టర్స్‌ కౌన్సెలింగ్‌

యైుటింక్లయిన్‌కాలనీ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అడ్రియాల, ఓసీపీ-2 ఉద్యోగులకు సెక్టార్‌-3 కాలనీలో టీటూ, టీవన్‌, షిర్కే క్వార్టర్‌లను కేటా యించేందుకు గురువారం అధికారులు క్వార్టర్ల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 55 మంది దరఖాస్తు చేసుకోగా సీఈఆర్‌ క్లబ్‌లో జరిగిన కౌన్సెలింగ్‌కు 18 మంది ఉద్యోగులు హాజరయ్యారు. అందరికీ క్వార్టర్‌లను కేటాయిస్తూ అధికారులు అలాట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. కౌన్సెలింగ్‌లో ఎస్వోటూ జీఎం రాముడు, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ జిగురు రవీందర్‌, ఏజీఎం పర్సనల్‌ అరవిందరావు, అధికారులు సంతోష్‌కుమార్‌, సునీత, ప్రతాపగిరిరాజు, వేణుగోపాల్‌, షరీఫ్‌ మహమ్మద్‌తో పాటు క్వార్టర్‌ సెక్షన్‌ గార్డు రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:13 AM