కొత్త లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:11 AM
కార్మికులకు అన్యాయం కలిగే విధంగా కొత్త లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కాట్నపల్లి వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలసి కొత్త లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను వారు ఆవిష్కరించారు.
సుల్తానాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు అన్యాయం కలిగే విధంగా కొత్త లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కాట్నపల్లి వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలసి కొత్త లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ముత్యంరావు మాట్లాడుతు కార్మి కులు వందేళ్ల నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం కలిగించే కొత్త చట్టాలను తీసుకురావడం పెట్టు బడి వర్గాల ప్రయోజనాల కోసమేననని ఆరోపించారు. కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చామని, సమ్మెను జయ్రదం చేయాలని కార్మికులకు సూచిం చారు. సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, గుమస్తా సంఘం అధ్యక్షుడు మాతంగి రాజమల్లు, ఆపరేటర్స్ యూనియన్ ప్రఽధా న కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, పురం హరికిషన్ రావు, బండారి స్వామి, సుఽధాకర్ రావు, తిరుపతి, మహేందర్, రాజేశఽం, సతీష్ పాల్గొన్నారు.