ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీలకు అన్యాయం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:16 AM
నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్‌లలో ఓసీలకు తీరని అన్యా యం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు ఆరోపించారు. శనివారం కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి మహా ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్‌లలో ఓసీలకు తీరని అన్యా యం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు ఆరోపించారు. శనివారం కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి మహా ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఓసీల జనాభా 80 శాతం ఉన్న వార్డులు, డివిజన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కాగా, ఎస్సీ, ఎస్టీ బీసీలు 79 నుంచి 89 శాతం ఉన్న ప్రాంతా లను జనరల్ కేటగిరీలో చేర్చడం ఈ కుట్రకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేసిన స్థానాల్లో ఓసియేతరులు 80 శాతం ఉండటంతో ఓసిలు అక్కడ గెలుపొందే పరిస్థితి లేదన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీయేతరులకు కొన్ని పార్టీలు టికెట్లు ఇచ్చి ఓసీలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైన విధానాలు అనుసరించడం వల్ల ఓసీలు సర్పంచ్ అవకా శాలు కోల్పోయారని వెల్లడించారు. పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఓసీలు కలిసి రావా లని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ స్థాయిలో ఓసీ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఈడబ్ల్యూ ఎస్ అర్హతకు వార్షికాదా యం 10 లక్షలకు పెంచా లని, రైతుబీమా వయోపరి మితిని 70 ఏళ్లకు పెంచాల ని తదితర డిమాండ్ల సాధ నకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న నిర్వ హించ తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోద రుడు రఘునందన్‌రెడ్డి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా నివాళులర్పించారు. ఓసీ జేఏసీ జిల్లా చైర్మన్ బైరెడ్డి రాంరెడ్డి, నాయకులు ఎర్రం మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అడప బాపు రెడ్డి, బుచ్చం రావు, తిరుపతిరెడ్డి, కొత్తిరెడ్డి సంత్ రెడ్డి, కనకయ్య, రమేష్, పాల్గొన్నారు.