Share News

నామినేషన్ల ప్రక్రియను పరిశీలన

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:09 AM

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామి నేషన్ల దాఖలు కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం పరిశీలించింది. పరిశీలకులు కె పద్మజ రాణి, సుజాత తదితరులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి సూచనలు చేశారు.

నామినేషన్ల ప్రక్రియను పరిశీలన

సుల్తానాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామి నేషన్ల దాఖలు కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం పరిశీలించింది. పరిశీలకులు కె పద్మజ రాణి, సుజాత తదితరులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు అనుగుణంగా ఉన్న నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు. నామి నేషన్ల దాఖలకు పరిమితికి లోబడి అభ్యర్థులను అనుమతిం చాలని ఒక్కసారిగా ఎక్కువ మందిని అనుమతించవద్దన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్‌ ఎన్ని కల్లో భాగంగా నామినేషన్ల దాఖలు సెంటర్‌ను, ఎన్నికల ఏర్పాట్లను స్టేట్‌ అబ్జర్వర్‌ కే.పద్మజరాణి గురువారం పరిశీలించారు. మున్సిపల్‌ కార్యాలయంలోని నానిమేషన్ల సెంటర్‌ను ఆమె పరిశీలించి అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు.

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో నామినేషన్‌ కేంద్రాలను గురువారం ఎన్నికల పరిశీలకులు కే పద్మజరాణి, బీ సుజాతలు పరిశీ లించారు. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో చర్చించారు. కార్పొరేషన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ మధుకర్‌ ఉన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:09 AM