Home » Sircilla
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిరియాట్రిక్ వార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. వయసు పైబడిన, బెడ్ రిడెన్ పేషెంట్లకు ఈ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వద్ద నిర్వహి స్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌ను పరిశీలించారు.
మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం అదనపు కలెక్టర్ వేణు సందర్శించారు. ఎలక్ర్టిక్ కాం టాలో లోపంపై విచారణ నిర్వహించారు. కాంటాపై బస్తా తూకం వేయగా తక్కువ బరువు చూపించడంతో రైతులు నష్టపో యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్గాం, పాలకుర్తి మండ లాల్లోనే రైతాంగానికి రెండు పంటలకు నీరందించేలా ఎల్లంపల్లి వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించానన్నారు.
పుస్తకాలే ప్రియ నేస్తాలని, విద్య అనేది గొప్ప ఆయుధమని, గత ప్రభుత్వంలో నిర్వీ ర్యమైన గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.1.50 కోట్ల నిధులతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలనికలెక్టర్ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సంద ర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ కరుణాకర్‌లతో కలిసి అధి కారులు, కలెక్టరేట్ సిబ్బందిచే మాదకద్ర వ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు.
కేజీబీవీలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాల, అంతర్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థుల బోధన శైలి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ వైద్యులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు.
కొత్త నిబంధనలు ఎత్తివేసి, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో అధికారులతో మాట్లాడి రాజీవ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధ్యమవు తుందన్నారు.
అరవై సంవ త్సరాలు పైబడిన వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనని మంథని సీనియర్ సివిల్ జడ్జి వీ. భవానీ స్పష్టంచేశారు. కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధుల సంక్షేమ చట్టం-2007పై అవగాహన సమావేశం లో జడ్జి భవానీ మాట్లాడారు.