అభివృద్ధిని చూసి ఓటేయండి..
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:59 PM
నిరంతరం స్థానికంగా ఉంటూ నిజా యితీగా సేవలు అందిస్తున్నాన్నని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలి పారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ఎంతో అభివృధ్ధి చేసినట్లు తెలిపారు.
పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) నిరంతరం స్థానికంగా ఉంటూ నిజా యితీగా సేవలు అందిస్తున్నాన్నని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలి పారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ఎంతో అభివృధ్ధి చేసినట్లు తెలిపారు. రోడ్లు, మురి కి కాలువలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని వివరించారు.. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయమార్కెట్ ఆవ రణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డిఎంఎఫ్‌టీ నుంచి నిధులు కేటాయించినట్లు తెలిపారు. బైపాస్‌రోడ్డు టెండర్లు పూర్తి చేశామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించామని, 100 పడకల విస్తరించి ఏంఆర్‌ఐ, సిటీస్కాన్‌లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొ న్నారు. బస్ డిపో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణం లోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అధికారపార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అనంతరం 36వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే
పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రకటించారు. 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకటవ వార్డు పూరేళ్ళ శైలజ, రెండో వార్డు లక్ష్మి పస్తం, మూడో వార్డు మొలగూరి కమల్, నాల్గవ వార్డు కొమ్ము సుధాకర్, ఐదవ వార్డు గుజ్జుల కుమారస్వామి, ఆరవ వార్డు కట్ట పద్మావ, ఏడవ వార్డు ఈర్ల స్వరూప, 8వ వార్డు ఎరుకల కల్పన, 10వ వార్డు అక్కెపల్లి సుజాత, 11వ వార్డు అనూష పూదరి, 12వ వార్డు దొడ్డుపల్లి జగదీష్, 13వ వార్డు పాగల శ్రీకాంత్, 14వ వార్డు మహమ్మద్ అస్లాం పర్వేజ్, 15వ వార్డు నేతెట్ల కొమురయ్య, 16వ వార్డు నాంసాని శ్రీనివాస్, 17వ వార్డు తోట ఫణీందర్, 18వ వార్డు భూతగడ్డ సంపత్, 19వ వార్డు, నల్లాల పద్మ, 20వ వార్డు బండి రమ్యకృష్ణ, 21వ వార్డు నూగిళ్ళ మల్లయ్య, 22వ వార్డు ఉప్పు స్వరూప, 23 తాడూరి శ్రీమన్నారాయణ, 24వ వార్డు కొట్టే స్వరూప, 26వ వార్డు సూది మల్ల అమ్రేష్, 27వ వార్డు ఉనుకొండ సరస్వతి, 28వ వార్డు తూముల లత, 29వ వార్డు ఇల్లందుల రజని, 30వ వార్డు సాజిదాబాను, 31వ వార్డు మంథని నర్సింగ్, 32వ వార్డు తిర్రీ శ్రీలత, 34వ వార్డు బూతగడ్డ స్వప్న , 35వ వార్డు దేవనంది రమాదేవి, 26వ వార్డు ముస్కాన్ నాజ్ నయ్యర్‌లకు బీ ఫాంలు అందజేశారు.
రామగుండంలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
కోల్‌సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొదటిరోజు ముగ్గురుఅభ్యర్థులు నాలుగు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు 28, 43, 46డివిజన్లలో ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. 43వ డివిజన్‌లో కొప్పుల ఈశ్వర్, 46వ డివిజన్‌లో కన్నూరి సతీష్ నామినేషన్లు ఉప సంహరించుకున్న వారిలో ఉన్నారు.