క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:00 AM
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్‌జీ-1 ఏరియా జీడీకే 1ఇంక్లైన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్‌జీ-1 ఏరియా జీడీకే 1ఇంక్లైన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులు క్రీడాపోటీల్లో పాల్గొనడం అభినందనీయమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని, గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది అన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రిలే ఏ జట్టు విజయం సాధించగా ప్రథమ బహుమతి రూ.15,500, రన్నర్‌గా నిలిచిన రిలే సీకి ద్వితీయ బహుమతి రూ.10వేలను అందజేశారు. టోర్నమెంట్ నిర్వాహకులు సిర్ర మల్లికార్జున్, వినయ్‌కుమార్, రమేష్, భరత్, వివేక్, ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ టైసన్ శ్రీనివాస్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, రాంచందర్, రమేష్, మేకల నాంపల్లి, జక్కుల శంకర్ పాల్గొన్నారు.
రికార్డు సాధించిన జీడీకే 1,3 ఇంక్లైయిన్
గోదావరిఖని, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 1, 3 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో జనవరి మాసంలో 656టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గానికి 703టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించిదని ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. అంతేకాకుండా 703టన్నుల బొగ్గును డిస్పాచ్ చేయడం జరిగిందని, ఐదు ఎస్‌డీఎల్ యంత్రాలతో 750టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్టు చెప్పారు. రెండు నెలల నిర్దేశానికి గాను 120రేకుల లక్ష్యానికి గాను 135రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేసి సీఎస్‌పీ అధికారులు, ఉద్యోగులు రికార్డు సృష్టించారని చెప్పారు. ఈ విజయాన్ని సాధించిన జీడీకే1,3, సీఎస్‌పీ ఉద్యోగులు, అధికారులను జీఎం అభినందించారు.