బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:42 PM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులను నడప డంతో ఇతర రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్ప డింది. సోమవారం ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 2 (ఆంధ్ర జ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులను నడప డంతో ఇతర రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్ప డింది. సోమవారం ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఆర్‌టీసీ సమ్మక్క - సారలమ్మ జాతరకు 4వేల బస్సులను నడపడంతో బస్టాండ్‌లో బస్సులు రాకపోవడం, వివిధ రూట్లలో నడిచే సర్వీసులు లేకపోవడంతో ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్, హైదరాబాద్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ధర్మారం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఉదయం నుంచి ఆఫీస్‌లకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడ్డారు. ప్రయాణికులు మూడు నుంచి నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు. అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు వెళ్లిన బస్సులు రాకపోవడంతో బస్సుల కొరత ఏర్పడుతుందని, ట్రాఫిక్ జామ్‌లో చాలా బస్సులు నిలిచిపోవడంతో సర్వీసులు సకాలంలో రాలేదని ఆర్‌టీసీ డిపో మేనేజర్ నాగభూషణం పేర్కొన్నారు. రెండు రోజులుగా గోదావరిఖని బస్టాండ్‌లో బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.