విద్యార్థి దశలో క్రీడలు కీలకం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:20 AM
విద్యార్థి దశలోనే క్రీడలు కీల కమని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఎంపీడీవో సుమలత అన్నారు. శనివారం నందిమేడారం బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ ఆటల పోటీలను ఎంఈఓ ప్రభాకర్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ధర్మారం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలోనే క్రీడలు కీల కమని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఎంపీడీవో సుమలత అన్నారు. శనివారం నందిమేడారం బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ ఆటల పోటీలను ఎంఈఓ ప్రభాకర్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం తోపాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, క్రీడల్లో రాణించి పతకాలు సాధించిన విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. శనివారం బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్ పోటీలను నిర్వహించగా, సోమవారం బాలికలకు పోటీలు నిర్వహిస్తామని ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడమే కాకుండా మత్తు పదా ర్థాలకు దూరంగా ఉంటారని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ అన్నారు. యువత చెడువ్యసనాలకు, మాదకద్రవ్యా లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాఠ శాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ నిర్మల, వ్యాయామ ఉపా ధ్యాయులు టీ.సౌజన్య, ఎన్.కొమురయ్య, బి.కొము రయ్య, టి.కుమార్, భాగ్యలక్ష్మీ, నర్మదా, నవిత, బి. శివమణి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పోటీ లకు యువత ఎంపిక కావాలని ఎంఈఓ ఇల్లం దుల విజయ్‌కుమార్ అన్నారు. శనివారం జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఎంపీడీఓ ప్రియాంక, తహసీల్దార్ ముస్త్యాల వాసంతి, ఎస్‌ఐ కొట్టె ప్రసాద్‌లు ప్రారం భించారు. ఎంఈఓ మాట్లాడుతూ ఇందులో ఎంపికైన వారిని నియోజకవర్గస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తార న్నారు. పట్టుదలతో ఆడితే ఓట మి ఉండదని, గెలుపు, ఓట ములను సమానంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. పీడీలు రేణుక, కవిత పాల్గొన్నారు.
గుండారం సర్పంచ్ జంగిలి పోచాలు క్రీడాకారులను సన్మానించారు. మండల కేంద్రంలో జరిగిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గుర్రాల వంశీ, నాయిని మణికంఠ, పిడుగు అజయ్, గాదే అంజిత్‌లను పెద్దమ్మ ఆలయం వద్ద సన్మానించారు. వీరు మండల స్థాయికి ఎంపిక కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 3న మంథనిలో జరిగే మండల స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. మండల, జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని సర్పంచ్ ఆకాంక్షించారు. గుర్రాల రాకేష్, పిడుగు సంజయ్ పాల్గొన్నారు.